by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:35 PM
తెలంగాణలోని యూనివర్సిటీల్లో 100% ప్రక్షాళన జరగాలని వైస్ ఛాన్సలర్లను CM రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నూతన వీసీలు సీఎంతో శనివారం భేటీ అయ్యారు.
'ప్రతి యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసి నివేదిక తయారు చేయండి. మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా VCలను ఎంపిక చేశాం. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి' అని సూచించారు.