by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:33 PM
వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన 144 మంది వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు చేరవేసే ప్రధాన బాధ్యత అధికారులదే అని సూచించారు.