by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:31 PM
నల్గొండ: మాడుగులపల్లి, వేమలంపల్లి మండల పరిధిలో పలు గ్రామాలలో గత కొద్దీ రోజులుగా కురిసిన అకాల వర్షానికి పంటలు నేలమట్టమైన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇట్టి పొలాలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం.
అందిస్తామని 15 రోజులు అవుతున్న, వ్యవసాయ అధికారుల నుంచి రైతులకు ఎలాంటి సమాచారం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులను ఆదుకోవాలని శనివారం వేడుకున్నారు.