by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:29 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రధాని మోదీకి వివరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని పూడుస్తున్నామని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని అన్నారు.