by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:10 PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వెళ్ళే ఫల్గుణ లాంచ్ ను శనివారం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. శనివారం సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని, దర్శనం అనంతరం ఆదివారం సాగర్ కు లాంచ్ చేరుకోనుంది.
సుమారు 100 మంది టూరిస్టులు లాంచ్ లో బయలుదేరారు. కాగా కృష్ణానదిలో పయనిస్తూ నల్లమల అటవీ అందాలు వీక్షిస్తూ యాత్ర కొనసాగనుంది.