by Suryaa Desk | Tue, Nov 05, 2024, 03:12 PM
సీపీఐ 100వ ఆవిర్భావ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహరెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం దేవరకొండలో జరిగిన సీపీఐ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో అనునిత్యం పేదల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి రావు, అంజయ నాయక్, వెంకటరమణ, వెంకటయ్య తదితర నేతలు పాల్గొన్నారు.