|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:51 PM
తెలంగాణలో శీతాకాలం అధికారికంగా ముగిసినట్టు ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఉరుములు–మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అదేవిధంగా, రాబోయే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌కు లోపే ఉండనున్నాయని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని చెప్పారు.ఫిబ్రవరి 14న విడుదల చేసిన భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, పటాన్‌చెరులో 13 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజేంద్రనగర్, హన్మకొండ, ఖమ్మం, మెదక్ ప్రాంతాల్లో కూడా సాధారణ స్థాయికి కంటే కొన్ని డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.