by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:01 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పల్ తండాకు చెందిన, నిరుపేద ధరావత్ సోమ్లా నాయక్, గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
మృతుడి కుటుంబానికి క్వింటా బియ్యం అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడంలో ముందుంటామని, అందరం కలిసి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్, మేరుగు మధు, జున్నూరి వెంకన్న, బొల్లి సారయ్య, ధోనికల రామచంద్రు, బుర్ర ఉపేందర్, గడ్డం హరికృష్ణ, మోల్కాపూరి సురేష్, మెరుగు కరుణాకర్, సోమ్ల, రవి, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.