by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:50 PM
సన్న రకం వరి ధాన్యాన్ని క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి అన్నారు. శనివారం ధన్వాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతుకు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. ఛైర్మెన్ ను సన్మానించారు.