by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:45 PM
కటింగ్ లేకుండా ప్రతి గింజకు మద్దతు ధర చెల్లిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి, గర్రెపల్లి, భూపతిపూర్, ఐతరాజ్ పల్లి, దుబ్బపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు పాల్గొన్నారు.