by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:46 PM
కె. టి. దొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్ కుమార్ మరియు ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.