by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:34 PM
వికారాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నవపేట్ మండల నూతన కమిటీ పదిమందితో ఎన్నుకోవడం జరిగింది. నవపేట్ మండల అధ్యక్షుడిగా బద్రీనాథ్ కార్యదర్శిగా జస్వంత్ ఉపాధ్యక్షుడిగా చారి సహాయ కార్యదర్శిగా మహమ్మ ద్ నవపేట్ మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలి ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి.
నవపేట్ నుండి వికారాబాద్ వచ్చే విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవపేట్ మండల అధ్యక్షుడు బద్రీనాథ్ కార్యదర్శి జశ్వంత్ మండల కమిటీ సభ్యులు సాయి ప్రవీణ్ చారి కార్తీక్ సిద్ధార్థ మణికంఠ చారి విద్యార్థులు తదితర పాల్గొన్నారు. vc