![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 12:37 PM
ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 30న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం. డీ. షఫీక్ అహ్మద్ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారితో జిల్లా జట్టును ఎంపిక చేస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు వయసు ధ్రువీకరణపత్రంతో ఉదయం 8గంటలకు హాజరుకావాలని సూచించారు.