by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:32 PM
నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా గ్రామ మాజీ సర్పంచ్ మంగ్లీ భర్త హరిలాల్ సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు తాండవాసులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం బస్సు నుండి ప్రమాదశాతు మాజీ సర్పంచ్ మంగ్లీ పడిపోయి మంచాన పడింది. హరిలాల్ భార్యపై బెంగతో లోలోపల కుమిలిపోతు గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.