by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:03 PM
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో మోజర్ల, మద్దిగట్ల, మంగంపల్లి, గ్రామాలలో ఏర్పాటు చేయించిన హైమాస్ట్ లైట్లను మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాలలో ఇలాంటి హైమాస్ట్ లైట్లు అవసరమని దాతలు ముందుకు వచ్చి గ్రామాలలో ఇలాంటి లైట్లు ఏర్పాటుచేసి వెలుగులు నింపాలని ఆయన కోరారు.