![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 11:43 AM
కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో అంగవైకల్యంతో బాధపడుతున్న బాలునికి గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల రాములు గురువారం వీల్ చైర్ ను అందజేశారు. గ్రామానికి చెందిన కర్నాటి కాషా గౌడ్ కుమారుడు కర్నాటి కుషాల్ కుమార్ గౌడ్ కు నాలుగు సంవత్సరాల వయసులో అంగవైకల్యం వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్ రాములు తన సొంత ఖర్చులతో కుశాల్ కుమార్ గౌడ్ కు వీల్ చైర్ ను అందించారు.