![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:04 PM
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాట్లపై జిల్లా సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి తప్పని సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.