![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 12:19 PM
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన వెంకటన్న కుమారుడు నరేష్ ఇటీవల కురుమూర్తి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో నాలుక తెగిపోయి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకునిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బుధవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆర్. యం. ఓ. తో మాట్లాడి మెరుగైన చికిత్సకు కృషి చేశారు. నరేష్ ను ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు