![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 12:07 PM
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా లో గల విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం పూల మాల వేసి నివాళులు అర్పించారు.