![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:18 PM
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట కిష్టయ్య, శంకరయ్య, శోభ, సిబ్బంది ఉన్నారు.