![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:41 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న భూక్యా జయకృష్ణ, నాగబాబు, సీతారాం, శంకర్రావు, సరిలాల్ మంగళవారం హాస్పిటల్ బిల్డింగ్ పైకిఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తాము పనిచేస్తున్న సహారా ఏజెన్సీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడి సర్ది చెప్పారు.