by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:40 PM
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 504. 00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 00 టీఎంసీలకుగాను 121. 7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.