by Suryaa Desk | Sun, Jun 30, 2024, 02:18 PM
సూర్యాపేట మండల కేంద్రంలో గుట్కా దందా జోరుగా సాగుతుంది. అధికారులు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గుట్కా విక్రయాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.