by Suryaa Desk | Thu, Jan 02, 2025, 10:31 AM
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు.ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం వరాహ అవతారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. మహానివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు.కాగా, రెండో రోజైన బుధవారం స్వామివారు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. తొలుత స్వామివారిని మేళతాళాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం కూర్మావతారంలో ఉన్న స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 9న తెప్పోత్సవం, 10న ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా జనవరి 10 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను అధికారులు నిలిపివేశారు.