by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:19 PM
ముస్తాబాద్ మండలంలోని ఎగువ మానేర్ కుడికాలువ ద్వారా రైతుల పంట పొలాలకు నీటిని విడుదల చేసి కాలువలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని జెసిబి సహాయంతో అధికారులు తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి కాల్వను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతుంది యాసంగి పంటకు మానేరు కెనాల్ ద్వారా ముస్తాబాద్ పోతుగల్ తెర్లుమద్ది వరకు సాగునీరు అందించే కాలువలో ముస్తాబాద్ మురికి నీరు వదలడం వల్ల చెత్త చెదారం.
తుంగ పిచ్చి మొక్కలు కాల్వలో నిండిపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో జెసిబి సాయంతో చెత్తను తొలగిస్తున్నామని నిన్నగాక మొన్న టిఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని గత సంవత్సరం కూడా కాలేశ్వరం ద్వారా ముస్తాబాద్ చెరువు మానేర్ నింపేమని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి సాగునీరు అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు .ఆంజనేయులు ఇరిగేషన్ అధికారి రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.