![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 11:17 AM
సరూర్ నగర్ లోని ఆర్మీ ఫిజికల్ అకాడమీలో అగ్నివీర్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ నందు నాయక్ పేర్కొన్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని, ఆర్మీ, ఎస్ఎస్సీజీడీ, ఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎస్ఐ, పీసీలుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. అగ్నివీర్ అభ్యర్థులకు 1600 పరుగు కోసం ప్రత్యేకంగా శిక్షణ, ప్రాక్టీస్ ఇక్విప్మెంట్స్, ఫుల్ అప్బర్ ఏర్పాటు చేశామని తెలిపారు.