by Suryaa Desk | Fri, Jun 28, 2024, 10:25 AM
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో 19. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 16. 0 మి. మీ, జోగులాంబ గద్వాల జిల్లా కల్లూరు తిమార్దొడ్డిలో 4. 5 మి. మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 0. 8 మి. మీ, కాగా మహబూబ్ నగర్ జిల్లాలో '0' మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.