by Suryaa Desk | Wed, Jan 01, 2025, 07:30 PM
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాదులోనీ ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్. దీనికి స్పందనగా ముఖ్యమంత్రి కూడా చిరునవ్వుతో నీలం మధు ముదిరాజ్ కు అందరూ బాగుండాలని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఓ పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. అర్అర్ఆర్, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం ఎల్లవేళలా అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.