by Suryaa Desk | Thu, Jan 02, 2025, 12:39 PM
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు.గురువారం సిద్ధిపేట జిల్లా కోహెడలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పని చేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ. 30 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు హుస్నాబాద్ కు 250 పడకల హాస్పిటల్ మంజూరు అయిందని చెప్పారు.