by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:23 PM
ఈరోజు ఉదయం 10 గంటలకు కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో గల విట్నెస్ ఆఫ్ ట్రూ లైట్ మినిస్ట్రీస్ చర్చ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా WTLM వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ పిల్లి కుమారస్వామి మాట్లాడుతూ దేవుని కృపను బట్టి మరియొక నూతన సంవత్సరంలో ప్రవేశించామని ప్రపంచంలోనే ప్రజలందరూ శాంతి సమాధానములతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని , దేశ ప్రజలందరు క్షేమంగా ఉండాలని మనసారా కాంక్షిస్తూ దైవ దీవెన ప్రకటించారు.
అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరు దేవునికి కీర్తనలను ఆలపించి ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పిల్లి మత్తయి, జీవమ్మ, సరిత, భరత్ భూషణ్, చేతి సతీష్, దాసరి ఏకాంబ్రం, కర్ర నరసింహారెడ్డి, బనిశెట్టి వెంకటేష్,పూస యాకాంబ్రం, పిల్లి రాము, వేణు, పూస కిరణ్, పవన్, వరిపల్లి దయాకర్, జిన్న సారయ్య మరియు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.