by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:27 PM
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడి అందరి మనసులను దోచుకోవాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బుధవారం మండల కేంద్రం బెజ్జంకిలో బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 47వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీ తత్వంతో ఆడినప్పుడే క్రీడల్లో విజయాలను సిద్ధం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా, క్రీడల్లో సత్తా చాట వచ్చన్నారు. గ్రామీణ ప్రాంత యువకులు క్రికెట్లో చక్కటి ప్రదర్శన ద్వారా గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి ఎదగాలని ఆయన కోరారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపుకు నాంది కాగలదన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పులి కృష్ణ ఉపాధ్యక్షులు చిలివేరి శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, నిర్వాహకులు దూమాల సురేష్, తిప్పారపు మహేష్, బండి వేణు, సంపంగి విజయ్, రాము, రాజు, నాయకులు అక్కరవేని పోచయ్య, శరత్, సందీప్, బైర సంతోష్, రోడ్డ మల్లేశం, జెల్ల ప్రభాకర్, బోనాల మల్లేశం, చెన్నారెడ్డి, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.