by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:29 PM
అతి ప్రాచీన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి తోపాటు సీతారామచంద్ర స్వాములకు వేద పండితులు ఆరుట్ల మాధవ మూర్తి విశేష పూజలను నిర్వహించారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, విష్ణు సహస్రనామ పారాయణము, తిరుప్పావలి, గోదాదేవికి రకరకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. దేవాలయం కు వచ్చిన మహిళలు, శరణాగతి దీక్ష తీసుకున్న మహిళ దీక్ష పరులు భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నామస్మరణతో దేవాలయం మారు మోగింది.
శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి బృందం భక్తి పాటలు ఆలపిస్తుంటే మహిళలు వారితోపాటు మైమరిచి నృత్యాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల మాధవ మూర్తి మాట్లాడుతూ అందరూ కలిసి పండుగలు సంబరంగా నిర్వహించుకుంటేనే ఆనందం ఉంటుందన్నారు. నేటి నుంచి 13వ తారీకు గోదా కళ్యాణం వరకు ఉత్తర ద్వార దర్శనం, విశేష పూజలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ప్రముఖ న్యాయవాది టింగిల్ కార్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, భజన మండలి కార్యదర్శి మునుకుంట సతీష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్, కాంగ్రెస్ జిల్లా నాయకులు రామకృష్ణ, తిరుమల తిరుపతి ప్రచారక కమిటీ మండల అధ్యక్షులు నాగ బండి శివప్రసాద్, భక్తులు పాల్గొన్నారు