by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:31 PM
కుకునూరుపల్లి మండల కేంద్రంలో బుధవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం కర్ణాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలకు మండల నలుమూలల నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. కార్యక్రమంలో నాయకులు తమ అభిమాన నాయకుడు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. పార్టీకి నర్సారెడ్డి చేస్తున్న కృషి అందరికి ఆదర్శప్రాయమని నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నాయకులందరు పేర్కొన్నారు. పదవుల కోసం తమ నాయకుడు ఎన్నడు పాకులాడలేదని నాయకులు అన్నారు. తమ నాయకుడు పార్టీ అభివృద్ధి చెందడం ధ్యేయగా పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నర్సారెడ్డి కృతకృత్యులయ్యారన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని నాయకులు తెలిపారు. అంతకుముందు కుకునూరుపల్లి బస్టాండ్ వద్ద బాణసంచ కాల్చి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొంతం కర్ణాకర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ లు ఐలం శివ యాదవ్, కాచం నవీన్ కుమార్, మిట్టపల్లి రుషి, కందుకూరి ఐలయ్య, మాజీ ఎంపీటీసీలు తూమ్ మహేందర్, ఇండ్ల కనకయ్య ముదిరాజ్, మైనారిటీ మండల పార్టీ అధ్యక్షులు అబేద్ అలీ, కాంగ్రెస్ నాయకులు రెడ్డమైన రవీందర్, కోల ఉపేందర్, రాజలింగం, కొప్పునూరి వీరేషం, సంతోష్ రెడ్డి, కిష్టారెడ్డి, కన్నమైన మహేష్, మల్లం లక్ష్మణ్, తూమ్ నవీన్, గ్యారమైన స్వామి, కుమార్, రాము, ఈగ తిరుపతి, ఈగ చంద్రం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేసిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్శించింది.