by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:31 PM
రోడ్డు, జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు బార్,రెస్టారెంట్ లాగా మారుతున్నాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. దాబాలలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోనిలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు వెంట ఉన్న దాబాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. బార్,రెస్టారెంటా.?దాబా నా.? అనే విధంగా చూడటానికి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దాబాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా,విచ్చలవిడిగా దాబాలలో మద్యం అమ్ముతున్న సంబంధిత అధికారులు మాత్రం ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. దాబాలలో, బిర్యాని, రోటి, పుల్కా, ఇతర తినే ఆహార పదార్థాలు దొరుకుతాయని కుటుంబ సభ్యులతో ఉద్యోగులు, నాయకులు, కలిసి వస్తారు.. కానీ ఇక్కడ దొరుకుతున్న మద్యం అమ్మకాలను చూసి ఇది దాబానా.? రెస్టారెంట్ నా.? అన్న చందాగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఫుడ్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.