by Suryaa Desk | Thu, Jan 02, 2025, 04:38 PM
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ కారణంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.వీటిని నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా అలాంటిదే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో అందరినీ షాక్కి గురిచేస్తుంది.తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అదే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న 40 ఏళ్ల లక్ష్మమ్మ అనే మహిళ పై నుంచి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.