by Suryaa Desk | Thu, Jan 02, 2025, 04:41 PM
జంట నగరాల రైల్వే ప్రయాణీకులకు మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. అంతర్జా తీయ విమానాశ్రయం తరహాలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ఈ నెల 6న ప్రారంభించనున్నారు.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.430 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మాణం పూర్తి చేసారు. డిసెంబర్ 28నే ఈ టర్మినల్ ప్రారంభించాల్సి ఉన్నా.. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందడంతో కార్యక్రమం వాయిదా పడింది.అధునాతన హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభానికి సిద్దమంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ను ఈ నెల 6న ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ప్రయాణీకులకు అందుబాటులో కి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడపై భారం తగ్గించేలా చర్లపల్లి నుంచి 25 ప్రధాన రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేలా నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాశ్రయ హంగులతో చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రయాణీకులకు అందుబాటులో కి వస్తోంది. హైదరాబాద్ - సికింద్రాబాద్ రైల్వే లో చర్లపల్లి రైల్వే స్టేషన్ అద్బుతమైన టర్మినల్ గా ఆవిష్కారం జరగనుంది.
ఈ టర్మినల్ లో ప్రయాణీకుల కోసం ఆధునిక సౌకర్యాలను అందుబాటు లోకి తీసుకొచ్చారు. ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుష- మహిళా ప్రయాణీకుల కోసం వేర్వేరు వెయిటింగ్ హాళ్లు రూపొందించారు. అదే విధంగా హైక్లాస్ వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేసారు. విమానాశ్రయాల తరహాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు సిద్దం చేసారు. తొలి అంతస్తులో కెఫెటేరియా .. రెస్టారెంట్ వంటి సౌకర్యాలను కల్పించారు. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధునిక సాంకేతికత వినియోగించి కొత్త డిజైన్లలో ప్రకాశవంతమైన లైటింగ్‌తో ఎలివేషన్ తీర్చిదిద్దారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచికూడ రైల్వే స్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 25 జతల ట్రైన్స్ చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించేలా షెడ్యూల్ ఖరారు చేసారు. చర్లపల్లికి ప్రయాణీకుల రాకపోకల కోసం కుషాయిగూడ, చంగిచర్ల డిపో ల నుంచి నిరంతరం బస్సులు నడిపేలా కసరత్తు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. ప్రధాని మోదీ మాత్రం వర్చువల్‌గా హాజరై రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.