'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 06:08 PM
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి... బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకున్నారు.కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ... నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.