'అన్నింటా మోసం.. రైతు భరోసా రూ.15 వేలని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు
Sun, Jan 05, 2025, 07:13 PM
by Suryaa Desk | Thu, Jan 02, 2025, 06:16 PM
కౌలు రైతులు, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదన్నారు. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసి కూడా ఇవ్వలేదన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేసి ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు.