by Suryaa Desk | Thu, Jan 02, 2025, 07:14 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.కాగా, సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్‌లో బాత్రూంల పక్కనే వంట గది ఉంది. బాత్రూం దృశ్యాలను వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థినులు నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో వారు ఆందోళనను విరమించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.