by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:16 PM
నల్లమల అడవిపచ్చపడుతోంది. ఇందుకు తగ్గట్టుగా అటవీశాఖ పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని పులుల సంచారం పెరిగింది. లోతట్టు అటవీ ప్రాంతంలో రెండు పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 40కి పైగా పెద్దపులుల సంచారం ఉండగా కొల్లాపూర్ నల్లమల అటవీప్రాంతంలోనే 13 నుంచి 16 దాకా సంచారం ఉందని అధికారులు తెలిపారు.