by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:54 PM
వనపర్తి జిల్లా ఘనపుర్ మండలం సల్కాలపూర్ కు చెందిన అనిత పురిటినొప్పులతో ఘనపుర్ పీహెచ్ లో అడ్మిట్ అయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆమెను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. ఆమె అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ జరిగిందని, మగబిడ్డకు జన్మనిచ్చినట్లు శుక్రవారం ఈఎంటి శశికుమార్, పైలెట్ మహేష్ తెలిపారు. ఆమెను జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ అడ్మిట్ చేసినట్లు సిబ్బంది తెలిపారు.