by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:24 PM
నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఇన్‌ఛార్జి చైర్మన్ ఏసీ రెడ్డి దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం శుక్రవారం నెగ్గింది. దీంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్ ఛైర్మన్ గా ఉన్న దయాకర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. మరో రెండు, మూడు రోజుల్లో కుంభం శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ ఎన్నుకోనున్నారు.