by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:24 PM
మాజీ మంత్రులు, సిద్దిపేట,మహేశ్వరం ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్ రావు, సబితారెడ్డికి పలువురు నేతలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని తల్లారం అనుబంధ గ్రామమైన దుద్దాగుకు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శశిపాల్ హరీశ్‌రావును నగరంలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శశిపాల్ ఆధ్వర్యంలో రూపొందించిన బీఆర్‌ఎస్వీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను హరీష్ రావు ఆవిష్కరించారు. అదేవిధంగా మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు నగరంలోని ఆమె నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ నవాబుపేట మండల వైస్ ప్రెసిడెంట్ శాంతి కుమార్, సీనియర్ నేత విష్ణు, బీఆర్‌ఎస్వీ నేతలు నందు, కార్తీక్, శ్రీనివాస్, తంగడిపల్లి మాజీ సర్పంచ్ అనూష సత్తయ్యగౌడ్ తదతరులు పాల్గొన్నారు.