by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:39 PM
రిక్రూట్ మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్న మాజీ మంత్రి హరీష్ రావు..BRS ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేసిన హరీష్ రావు.రేవంత్ రెడ్డి ఇచ్చామని చెప్తున్న 50 వేల ఉద్యోగాలకు మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించిన హరీష్ రావు.ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి జాబ్స్ ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా.హామీ ఇచ్చిన వాటిలో కనీసం 10 శాతం ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని విమర్శ..
గత ఏడాది డిసెంబర్ 9 లోపే రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. అర్హత ఉన్న వారిలో కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని వెల్లడి..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా వృద్దుల పెన్షన్ రూ.4 వేలకు పెంచలేదని వెల్లడి..మహిళలకు నెలకు రూ.2500, విద్యా భరోసా కార్డు ద్వారా ప్రతి విద్యార్థికి రూ.5 లక్షలు ఇవ్వలేదని తెలిపిన హరీష్ రావు.అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు.కల్యాణ లక్ష్మీ కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పి మాట తప్పారని వెల్లడి.ఇచ్చిన హామీలను పక్కన పెట్టడమే కాకుండా గత BRS ప్రభుత్వంలో ఉన్న దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, న్యూట్రిషన్ కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ ఎగ్గొట్టిందని ఆరోపణ..ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ తమ ఫెయిల్డ్ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు..