by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:40 PM
వికారాబాద్ మండల కార్యాలయం ముందు ధర్నాకు దిగిన గ్రామ పంచాయతీ,యూనియన్ నాయకులు కార్యకర్తలు మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, కనిస వేతనాలు26వేలు ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యం రిటైర్ మెంట్ బేనిపిట్స్ 5లక్షలు ఇవ్వాలని. పెండింగ్ జీతాలు ఇవ్వాలి. అధిక పని భారం తగ్గించాలని, 8గంటల పని విధానం అమలు చెయ్యాలి. మండల అధికారుల వేధింపులు ఆపాలని, గ్రామపంచాయతీ, వర్కర్ లకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అమలు చేయాలని, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులతో ఈ ప్రభుత్వం గట్టి చాకిరీ చేయించుకుంటుంది ప్రతి సర్వే ప్రతి పనిలో వీళ్లను ఉపయోగించుకుంటుంది పనికి తగిన వేతనం ఇవ్వడం లేదు అదనపు పనికి అదనపు డబ్బులు ఇవ్వడం లేదు రోజు రోజుకు అధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయి జిల్లా కలెక్టర్,(స్పీకర్, సీఎం) ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా 30 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి ఎంపీడి వో కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల కార్మికులు గోపాల్ నర్సింలు మహేందర్ చంద్రయ్య ఉషన్, గౌష్ పాషా నర్సింలు భీమేష్ శ్రీనివాస్ పోచ్చయ్య శుభని సత్తయ్య పోచయ్య తదితరులు పాల్గొన్నారు.