by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:43 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, బీసీ కులగణనతో బీసీలకు అన్ని అంశాలలో అవకాశాలు పెరుగుతాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్ లో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారితో కలిసి నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేతో బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సమగ్ర ఇంటింటి సర్వే తో సేకరించిన వివరాలతో ప్రజల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు. బీసీ కుల గణన తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరిగి రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ లోని అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుల నిర్ణయం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కులగణన తర్వాత సంక్షేమ పథకాలు మరింత వేగవంతమై అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి అందుతుందని హామీ ఇచ్చారు.ఈ కులగణన కార్యక్రమని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు చేరవేయాలి అని అధికారులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ , ఆంజనేయులు, తోపాజీ అనంత కిషన్,పులిమామిడి రాజు,శ్రీనివాస్ రెడ్డి,పుష్ప నగేష్ యాదవ్,వివిధ మండల,బ్లాక్