by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:46 PM
వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యంను తూకం వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా అదనపు కలెక్టర్ మాధవిలత సూచించారు.శుక్రవారం జోగిపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.కేంద్రం వద్ద రైతులు ఆరబెట్టిన వడ్లను ఆమె పరిశీలించారు. తమ దాన్యంను తొందరగా కొనుగోలు చేసి రైస్‌మిల్‌కు త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
రైస్ మిల్స్, లారీలు అలాట్‌మెంట్ విషయంలో మాట్లాడామని, స్థానికంగా జోగిపేటలోని రెండు రైస్ మిల్స్ తో మాట్లాడామని, లారీలు కూడా సిద్ధంగా ఉంచారని ఆమె చెప్పారు. తూకం వేసిన ధాన్యంను ఎప్పటికప్పుడు రైస్‌మిల్లర్ల వద్దకు తరలించాలని ఆమె కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు. యార్డుకు వచ్చిన ధాన్యం మొత్తం తొందరగా తూకం వేసి ఖాళీ చేయాలని ఆమె పిఎసిఎస్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్. జగన్మోహన్ రెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. జగన్ మోహన్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం కొండలరావు, పిఎసిఎస్ డిసిఒ కిరణ్ కుమార్, డీఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీహరి, సీఈవో నర్సింహులు, డైరెక్టర్లు చింతకుంట బిక్షపతి, పిర్లమర్ల నాగరాజు, మధుసూదన్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.