by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:49 PM
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కోరుట్ల నియోజకవర్గం జేఏసీ కన్వీనర్ పుప్పాల లింబాద్రి ఉన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం తోపాటు బీసీల రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 42 శాతానికి పెంచాలని కోరుతూ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు శుక్రవారం వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
బీసీ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని, కులవృత్తుల వారికి 100 శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ ను అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జేఏసీ కన్వీనర్ తోగిటి అంజయ్య, నాయకులు షికారి గోపికృష్ణ, ఆకుల ప్రవీణ్, బీర్కూరు విజయ్, అల్లె ప్రవీణ్, వెంకటేష్, శంకర్, రోజా తదితరులు పాల్గొన్నారు.