by Suryaa Desk | Sat, Nov 02, 2024, 03:58 PM
నెక్కొండ మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్లో ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి జెండాను వరంగల్ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు గారు పతాకాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైనది అని ఏఐటీయూసీ లో లాల లజపతి రాయ్, నెహ్రు, వివి గిరి, సుభాష్ ఛంద్ర బోస్, సరోజని దేవి, భగత్ సింగ్, డాంగే, ఇంద్ర జిత్ గుప్తా. బర్ధన్, గురుదస్ దాస్ గుప్తా. లాంటి గొప్ప వారు ఏఐటీయూసీ లో నాయకత్వం వహించారని ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలను, హక్కులను, సాధించిన ఘన చరిత్ర కలిగిన ఏఐటీయూసీ 104 ఏళ్ళు పూర్తి చేసుకొని 105 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుందని అన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడి సాధించిన 29 చట్టాలను 4 కోడ్ లుగా మార్చి హక్కులను కాలరాస్తూ యాజమాన్యలకు తొత్తులుగా చట్టాలు మార్పులు చేశారు అని ఆరోపించారు. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన మొట్టమొదటి కార్మిక సంఘం దేశంలో కార్మికుల పట్ల పూర్తి అవగాహన కలిగి ప్రతి సమస్య పైన హక్కులతో పోరాటం చేస్తున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగిన ఏఐటియుసి భవిష్యత్తులో కార్మికుల హక్కులు సాధించేవరకు నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సాంబయ్య బి వెంకన్న బక్కి నర్సయ్య ముత్యాల శ్రీలత సింగం వెంకటలక్ష్మి పిట్టల బుచ్చమ్మ శ్రీను బాగాతి భిక్షపతి రజిత తదితరులు పాల్గొన్నారు.