by Suryaa Desk | Sun, Dec 29, 2024, 11:41 AM
న్యూ ఇయర్ సందర్భంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు హాలిడే మూడ్లోకి వెళ్లడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు స్థిరంగా కదులుతోంది.ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,637 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 24 కేరెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.78,000 పైన ఉంది. వెండి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు, ప్రస్తుతం రూ.లక్ష కంటే తక్కువలో ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 99,900. గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,900 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.